అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా సత్తుపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం సత్తుపలి అగ్నిమాపక శాఖ ఆధ్వర్యాన నిర్వహించిన ఫైర్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రివాల్వింగ్ బ్రాంచ్, మల్టీ పర్పస్ బ్రాంచ్లతో పరిశ్రమల్లో మంటలను ఆర్పే విధానాన్ని ఫైర్ ఆఫీసర్ వై. వెంకటేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజ్యలక్ష్మి, వీబీఓ ఆనంద్, ఫైర్ ఉద్యోగులు మోషేబాబు, వీరబాబు, బాబురావు ఉన్నారు.