బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి పై సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ సత్తుపల్లి నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్ణి వీరంరాజు తెలిపారు. అంబేద్కర్ విగ్రహం శుద్ది చేసే క్రమంలో కాలు జారిపడిన పొంగులేటి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్ లో వైరల్ చేయటం అవివేకానికి నిదర్శనమన్నారు. పొంగులేటి అందరిలా అక్రమ సంపాదన కోసం మూడు, నాలుగు పార్టీలు మార్చలేదన్నారు.