బీజేపీ గిరిజన మోర్చా జిల్లా నాయకులు తేజావత్ బాలాజీ నాయక్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీ తల్లాడ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.