సత్తుపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

69చూసినవారు
లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం సత్తుపల్లి మండలం తాళ్లమడ గ్రామంలో చోటుచేసుకుంది. సత్తుపల్లి పట్టణానికి చెందిన ఎస్కే. షాజహాన్ (35), ఎస్కే. ఆసిఫ్ స్వగ్రామానికి వస్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో షాజహాన్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన ఆసీఫ్ ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద మృతుని బంధువుల రోదనలతో మిన్నంటాయి. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్