సత్తుపల్లి పట్టణంలోని గాంధీనగర్ గిరిజన సంక్షేమ ఎస్టి బాలుర హాస్టల్ లో ప్రభుత్వం చేపట్టిన కామన్ డైట్ మెనూను జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ శనివారం ప్రారంభించారు. ఈ మెనూ ద్వారా విద్యార్థినీ, విద్యార్థులకు మంచి పోషకాహారం అందుతుందని తెలిపారు. మెనూ అమలు తీరును తెలుసుకునేందుకు, ఎప్పటికప్పుడు హాస్టల్ లను పరిశీలిస్తామన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యమైన, శుభ్రమైన భోజనాన్ని అందించాలని కోరారు.