సత్తుపల్లి: యాతాలకుంట టన్నెల్ పనులను పరిశీలించిన మంత్రి

68చూసినవారు
సత్తుపల్లి మండలం యాతాలకుంటలో జరుగుతున్న సీతారామప్రాజెక్ట్ టన్నెల్​ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పరిశీలించారు. టన్నెల్ లో జరుగుతున్న పనుల గురించి ప్రాజెక్ట్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. యాతాలకుంట టన్నెల్ పనులు పూర్తయితే కమలాపురం పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలు దమ్మపేట మండలం మల్లెపూల వాగు మీదుగా బేతుపల్లి పెద్ద చెరువుకు చేరుకుంటాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్