సత్తుపల్లిలో నిర్వహించిన గాదె సత్యనారాయణ సంస్మరణ సభలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను రాజకీయాల్లో అన్నీ తానై నడిపించిన సత్యం ఈరోజు లేకపోవడం బాధాకరమని, ఆయన సలహా ప్రకారమే తన నడవడిక కొనసాగిందని, ఆయన లేకపోవడం తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు. ఆయన ఆలోచనలతో ముందుకెళ్తానని తుమ్మల కన్నీటి పర్యంతమయ్యారు.