సత్తుపల్లి మండల పరిధిలోని బుగ్గపాడులో వేద పాఠశాల నిర్మాణానికి ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. హర హర క్షేత్రం ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలకి పూర్ణ కుంభముతో స్వాగతం పలికారు. హరహర మహాదేవ శివునికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి అనంతరం వేద పాఠశాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.