ఎమ్మెల్యే మట్టారాగమయి గండుగులపల్లిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో గురువారం భేటీ అయ్యారు. అనంతరం నియోజకవర్గంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.