సత్తుపల్లి: చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించిన ఎమ్మెల్యే

79చూసినవారు
సత్తుపల్లి పట్టణంలో గల జలగం నగర్ లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అమ్మ మాట- అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని గురువారం  నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పాల్గొని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారులకు ఏకరూప దుస్తులు, పలకలు, బలపాలు రాగమయి పంపిణీ చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసం తన ఒడిలో చిన్నారిని కూర్చో బెట్టుకొని చేశారు. సీడీపీఓ మెహరూన్నీసబేగం, సూపర్ వైజర్ లు, టీచర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్