తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో జిల్లా నాయకులు పలువురికి స్థానం దక్కింది. ఈమేరకు 27మంది ఉపాధ్యక్షులు, 69మంది ప్రధాన కార్యదర్శులతో ఏఐసీసీ నుంచి సోమవారం జాబితా విడుదలైంది. ఇందులో ప్రధాన కార్యదర్శులుగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సహా పలువురికి చోటు కల్పించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన మద్దినేని బేబీ స్వర్ణకుమారి, నాగా సీతారాములు, కట్ల రంగారావు జాబితాలో ఉన్నారు.