పేద ప్రజలను ఆనందంగా ఉంచడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కాంగ్రెస్ జిల్లా నాయకుడు మట్టా దయానంద్ అన్నారు. శనివారం సత్తుపల్లి పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం అందించే నిధులతో ఇంటిని నిర్మించుకోవాలని సూచించారు. లబ్దిదారులకు విడతల వారిగా నగదు జమ అవుతుందన్నారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.