మద్యం మత్తులో ద్విచక్ర వాహనంతో ఇరువురిని ఢీ కొట్టిన ప్రమాదం సత్తుపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. మండలంలోని కిష్టారం గ్రామానికి చెందిన గద్దె వెంకటేశ్వరరావు సత్తుపల్లి వస్తుండగా హాయ్ స్పందన సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న హేమంత్, వెంకన్నలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు, హేమంత్లను సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించినట్లు స్థానికులు తెలిపారు.