ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థిని విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ చేతులమీదుగా గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలు కప్పి సత్కరించారు. పాఠశాల ప్రారంభం రోజునే యూనిఫాం, పుస్తకాలు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆమె అన్నారు. విద్యా శాఖాధికారి నక్కా రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.