సత్తుపల్లి: అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కేంద్ర బడ్జెట్

53చూసినవారు
సత్తుపల్లి: అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా కేంద్ర బడ్జెట్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భాస్కర్ణి వీరంరాజు బుధవారం అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో వేంసూరు మండల కేంద్రంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర బడ్జెట్ ను స్వాగతిస్తూ కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు పర్సా రాంబాబు, భీమిరెడ్డి బాలకృష్ణరెడ్డి, మాదిరాజు శ్రీనివాస్, కృష్ణ, మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్