ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని నండూరి సీతారామమ్మ స్మారక టి. ఎస్. యు. టి. ఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో 12 వ ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా యు. టి. ఎఫ్. ఎర్ర జెండాను సీనియర్ కార్యకర్త, మండల ఉపాధ్యక్షురాలు కనమతరెడ్డి శ్రీదేవి ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా శ్రీదేవి మాట్లాడుతూ యు. టి. ఎఫ్. సంఘం సమాజ శ్రేయస్సు కోసం, పీడిత ప్రజలకు, కార్మికులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు దోహదపడుతుందన్నారు.