సత్తుపల్లి: సరస్వతీ ఆలయంలో వసంత పంచమి వేడుకలు

60చూసినవారు
సత్తుపల్లి పట్టణంలోని సరస్వతీ ఆలయంలో సోమవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లలకు తమ తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా అక్షరాభ్యాసం చేయించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు దాతల సహాయంతో అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్