సత్తుపల్లి సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ పెండ్ర రమేష్ పరారీ, పట్టుబడిన ఘటన నేపథ్యంలో జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ మాలారపు సంపత్ బుధవారం విచారణ చేపట్టారు. రిమాండ్ ఖైదీ పరారీ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆరా తీశారు. జైలులో ఉన్న సీసీ పుటేజ్లను పరిశీలించారు. సబ్ జైల్ బయట గోడకు ఆనుకొని ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై త్వరలోనే శాఖా పరమైన చర్యలు ఉంటాయని చెప్పారు.