విధినిర్వహణలో అంకితభావం, ధైర్యసాహసాలు, శ్రద్ధ కనబరుస్తూ పోలీసు వ్యవస్థకు వన్నె తీసుకొచ్చేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ బెటాలియన్ లో 297 మంది కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలలుగా ఇస్తున్న శిక్షణ పూర్తయింది. ఈ సందర్భంగా పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించగా వారి నుంచి సీపీ, బెటాలియన్ కమాండెంట్ పి. చటర్జీ గౌరవ వందనం స్వీకరించారు.