సత్తుపల్లి: షార్ట్ సర్క్యూట్‌తో లారీ దగ్ధం

58చూసినవారు
కిష్టారం ఓసీ సమీపంలో షార్ట్ సర్క్యూట్‌తో లారీ దగ్ధమైంది. గురువారం జగన్నాథపురం నుంచి మట్టి లోడుతో వెళ్తున్న లారీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. గమనించిన డ్రైవర్ సత్తుపల్లి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా అప్పటికే లారీ పూర్తిగా కాలిపోయింది. దీంతో రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందిని లారీ యజమాని తెలిపాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్