సత్తుపల్లి మున్సిపాలిటీలో గతంలో జరిగిన అభివృద్ధి పనులలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఛైర్మన్ కూసంపూడి మహేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు. రూ. 9. 50లక్షల వ్యయంతో వార్డులలో బల్లలు ఏర్పాటు చేయగా కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. పార్టీలు, పదవులు శాశ్వతం కాదని, గెలిచినా ఓడినా మా ప్రయాణం సండ్ర వెంకటవీరయ్యతోనే అన్నారు.