సత్తుపల్లి పట్టణంలో గల స్థానిక విశ్వశాంతి విద్యాలయం విద్యార్థులు గత 3 సంవత్సరాలుగా చదువుల తల్లి సరస్వతి దేవి నెలకొన్న బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించడం ద్వారా హ్యాట్రిక్ సాధించారు. తాజాగా శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ట్రిపుల్ ఐటీ ఫలితాలలో విశ్వశాంతి విద్యార్థిని ఎండి. అర్షియా (569 మార్కులు) బాసర ట్రిపుల్ ఐటీ లో స్థానం సాధించింది. ఈ సందర్భంగా శనివారం అర్షియాను విశ్వశాంతి ఉపాధ్యాయులు అభినందించారు