వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సత్తుపల్లి పట్టణ ప్రజలు జాగ్రత్తలు వహించాలని మున్సిపల్ కమిషనర్ మందా రవిబాబు కోరారు. మీ ప్రాంతాలలో ఇళ్లు కూలిపోవడం, నీరు నిలవడం, దోమల బెడద నివారణకు మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని, సమాచారాన్ని 9704671081 నంబర్ కు ఇవ్వాలని కోరారు. పట్టణ ప్రజలు వర్షాకాల సమస్యల పరిష్కారానికై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.