తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు మండల అధ్యక్షులు కాపా సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి మల్లు భట్టి విక్రమార్క కు ,జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.