తల్లాడ మండలంలోని కుర్నవల్లి సబ్ స్టేషన్ పరిదిలో ముద్దునూరు ఫీడర్లో మరమ్మతుల దృష్ట్యా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ దారా కృష్ణ కాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. కావున వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.