తల్లాడ మండలంలోని సీపీఐ మండల మహాసభ పోటు ప్రసాద్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. మండల సీనియర్ నాయకులు నల్లమోతు నరసింహారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సింగ్ నరసింహారావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని సీపీఐ పార్టీకి అశేషమైన చరిత్ర ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.