మారుమూల గ్రామాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. టీఎస్ యూటీఎఫ్ 6వ జిల్లా మహాసభలు శనివారం సత్తుపల్లిలో ప్రారంభమైయ్యాయి. యువత ఎదుగుదలలో పాఠశాలల ప్రాముఖ్యత ఎంతో ఉందని, గ్రామస్థులతో ఎనలేని అనుబంధం ఉంటుందన్నారు. నూతన సంఘ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రారంభించగా రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.