రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల తరపున పోరాటం చేయాలని బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్నీ వీరం రాజు అన్నారు. శుక్రవారం సత్తుపల్లిలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అయన మాట్లాడుతూ. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులందరికీ రుణమాఫీ చేయాలని, వెంటనే కార్యాచరణ చేపట్టి అందరికీ న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.