వేంసూరు మండలంలోని కందుకూరులో కొలువు దీరియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకల సందర్భంగా గొర్ల సత్యనారాయణరెడ్డి (బుల్లి బాబు) జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎద్దులు బండలాగుడు పోటీలను గురువారం ప్రారంభమాయ్యాయి. ఈ పోటీలను కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్ ప్రారంభించగా. గెలుపొందిన విజేతలకు టీజీ ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు బహుమతులు అందించారు.