వేంసూరు: శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు

70చూసినవారు
వేంసూరు: శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు
వేంసూర్ మండలం కందుకూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానం కళ్యాణ మహోత్సవ వేడుకలలో భాగంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో గురువారం మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు.

సంబంధిత పోస్ట్