వేంసూరు: సామాజిక స్పృహతో పోరాడేది యుటిఎఫ్ మాత్రమే

68చూసినవారు
వేంసూరు: సామాజిక స్పృహతో పోరాడేది యుటిఎఫ్ మాత్రమే
ఉపాధ్యాయుల, ప్రజల సమస్యలపై సామాజిక స్పృహతో, అధ్యయనంతో నిరంతరం పోరాడేది యూటీఎఫ్ సంఘం మాత్రమేనని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కోలేటి నిర్మలకుమారి అన్నారు. ఆదివారం యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేంసూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సభలో ఆమె ప్రసంగించారు. ముందుగా ఆ సంఘం ఎర్రజెండా ను సీనియర్ నేత సయ్యద్ యాకుబ్ ఆలీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుత్తా చంద్రశేఖర్, సతీష్, శేషు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్