
నేను భారత్-పాక్ యుద్ధం ఆపలేదు: ట్రంప్
భారత్, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం రాకుండా అడ్డుకున్నామని రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం చేశానని చెప్పుకోవడం లేదని ట్రంప్ గురువారం కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో వాటి సమస్యను పరిష్కరించేందుకు మాత్రమే తాను సాయం చేశానని చెప్పుకొచ్చారు.