వేంసూరు మండలంలో వాగులు, కాల్వలు, చెరువులు చూడటానికి వెళ్లి సెల్ఫీలు దిగవద్దని తహశీల్దార్ మాణిక్ రావు హెచ్చరించారు. ఈత కోసం, పశువులను కడగటానికి, చేపలు పట్టడానికి, వాహనాలు శుభ్రపరచుకోవడానికి ఈత రాని వారు వెళ్లరాదని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. ఇటీవల గేదెలు కడగటానికి ఇద్దరు వాగులోకి వెళ్లి కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారన్నారు. విద్యాసంస్థలలో విద్యార్థులను ఉపాధ్యాయులు చైతన్య పరచాలన్నారు.