వైరా మండలం ఆదివారం విపరీతమైన ఈదురుగాలి వీయడంతో గౌండ్ల పాలెం ఆర్ అండ్ బి రహదారిపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. వైరా, నెమలి ఆర్ అండ్ బి రోడ్డు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ప్రమాదాలు జరగకముందే చెట్లకొమ్మలను తొలగించాలని బుధవారం ప్రయాణికులు కోరుచున్నారు.