నేడు ప్రకటించిన NEET 2025 పరీక్షా ఫలితాలలో శ్రీ చైతన్య ఖమ్మం విద్యార్థులు జాతీయస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచారు. అఖిల భారత స్థాయిలో 267, 541 వంటి టాప్ 1000 ర్యాంకులతో పాటు 1229, 2801, 3104, 3255, 3658, 4175, 4445, 4481 వంటి అత్యుత్తమ ర్యాంకులను సాధించారు. ఈ ఫలితాలతో సుమారు 60 మంది విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మక AIIMS, JIPMER వంటి వైద్య కళాశాలలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ, ఉస్మానియా, కాకతీయ వంటి ప్రముఖ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించి విజయం సాధించారు.శ్రీ చైతన్య ఖమ్మం విద్యార్థులు అఖిల భారత స్థాయిలో 1000 లోపు 2 ర్యాంకులు, 3000 లోపు 6 ర్యాంకులు, 5000 లోపు 11 ర్యాంకులు, 10000 లోపు 17 ర్యాంకులు, 15000 లోపు 24 ర్యాంకులు, 20000 లోపు 52 ర్యాంకులు సాధించి అత్యుత్తమ ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచారు.ఈ సందర్భంగా తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ మారుతున్న పరీక్ష విధానాలకు అనుగుణంగా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విద్యా ప్రణాళిక, రాష్ట్రంలోనే ఉత్తమ బోధనా సిబ్బందితో విద్యాబోధన, నిరంతరం విద్యార్థులకు అందుబాటులో ఉండటం, వారి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడం వలనే తమ విద్యార్థులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను సునాయాసంగా సాధించగలిగారని తెలిపారు.
విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీవిద్య మాట్లాడుతూ మారుతున్న విధానాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను రూపొందించి, దానికి తగిన అత్యున్నత స్థాయి బోధనా సిబ్బందిని విద్యార్థులకు అందించడం వలన తమ విద్యార్థులు జాతీయస్థాయి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో సునాయాసంగా అఖిల భారత అత్యుత్తమ ర్యాంకులను సాధించగలుగుతున్నారని అన్నారు.ఈ విజయాలను సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విద్యాసంస్థల ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లెంపాటి శ్రీవిద్య, అకాడమిక్ డైరెక్టర్ డా. బి. సాయి గీతిక, డీజీఎం సిహెచ్ చేతన్ మాధవ్, ఎగ్జిక్యూటివ్ ఎన్ఆర్ఎస్డి వర్మ, డీన్ జే కృష్ణ, ఏజీఎంలు సిహెచ్ బ్రహ్మం, జి ప్రకాష్, జి గోపాలకృష్ణ, ప్రిన్సిపాల్స్, అధ్యాపక బృందం మరియు అధ్యాపకేతర బృందం అభినందించారు.