ఈ సీజన్లో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 512 డెంగీ కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ఆయన శనివారం ఏన్కూరులో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించాక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం డీఎంఓ మాట్లాడుతూ జిల్లాలో చికెన్ గున్యా, మలేరియా కేసులు లేవని, డెంగీ కేసులే నమోదవుతున్నాయని తెలిపారు. అందరికీ రక్తపరీక్షలు చేయిస్తున్నట్లు వెల్లడించారు.