చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకోవాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఎ అలీమ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏన్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మి కంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని విద్యా ర్థులను అడిగి తెలసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల తరగతి గదులను, పరిసరాలను పరిశీలించారు.