కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశాన్నిఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ హాజరయ్యారు. ఆగస్టు 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు ప్రారంభించేందుకు వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలం నుండి ప్రజలు అధిక సంఖ్యలో హాజరావాలన్నారు.