కారేపల్లి మండల కేంద్రంలోని నూతనంగా నిర్మాణం చేపడుతున్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయానికి బిఆర్ఎస్ జిల్లా మైనారిటీ (ముస్లిం) నాయకులు ఎస్కే గౌసుద్దీన్ మంగళవారం రూ. 10, 116 లు వితరణగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. తాను ఒక ముస్లిం నాయకుడు అయి ఉండి, సర్వ మతాలు సమానమే అనే ధర్మాన్ని పాటించి మంచి మనసుతో హిందూ దేవాలయ నిర్మాణానికి తన వంతుగా సహకరించారు.