క్రీడాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఖమ్మం బీజేపీ లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోదరావు మంగళవారం అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఏన్కూరు మండలం తిమ్మరావుపేట గ్రామంలో జరుగుతున్న మూడురోజుల క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి మంగళవారం హాజరై మాట్లాడారు. ఫైనల్స్ కు చేరుకున్న క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రసంగించారు. భవిష్యత్తులో జిల్లా రాష్ట్రస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.