కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో బీజేపీ జిల్లా నాయకులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి సొంత నిధులతో 16 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.