పోగొట్టుకున్న పర్సు తిరిగి అందజేసిన సీఐ తిరుపతిరెడ్డి

57చూసినవారు
పోగొట్టుకున్న పర్సు తిరిగి అందజేసిన సీఐ తిరుపతిరెడ్డి
ఇల్లందు పట్టణంకు చెందిన పూణెం సందీప్ గురువారం కారేపల్లి బస్టాండ్ సెంటర్ లో పర్సు పోగొట్టుకున్నాడు. అదే ఏరియాలో బ్లూ కోర్టు విధులు నిర్వహిస్తున్న శంకర్ కానిస్టేబుల్ కు పర్సు దొరికింది. పర్సులో ఉన్న ఐడీ కార్డు ఆధారంగా సందీప్ ను పిలిపించి అందులో ఉన్న రూ. 4500 నగదు, ఐడి కార్డులను అతనికి కారేపల్లి రూరల్ సిఐ. తిరుపతి రెడ్డి, ఎస్ఐ ఎన్. రాజారావు చేతుల మీదుగా అందజేశారు.