కారేపల్లి మండల పరిధిలోని కొత్త కమలాపురం గ్రామంలో సోమవారం వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్ ఆదేశాల మేరకు మంజూరైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కర్నాటి తిరుపతమ్మ, సాయిని రాంబాయి, ఆళ్ల శ్రీనివాస్ రావుకు వచ్చిన చెక్కులను కాంగ్రెస్ నాయకులు గమిడి నరసింహారావు, వడ్డే అనంతరామయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.