పరిసరాల పరిశుభ్రత వల్ల వ్యాధులు దరిచేరవని కౌన్సిలర్ మాదినేని సునీత అన్నారు. శుక్రవారం వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించారు. అనంతరం మురికి నీళ్లలో ఆయిల్ బాల్స్ వేశారు. తదనంతరం స్థానిక ప్రజలకు మున్సిపల్ కమిషనర్ పారిశుధ్యం పై అవగాహన కల్పించారు.