కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు భూక్యా వీరభద్రం కోరారు. శనివారం ఏన్కూరు మండలంలో నిర్వహించిన సీపీఎం మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పేదలకు ఇళ్లు, ఇండ్లస్థలాలు, పోడు రైతులకు హక్కుల కోసం పోరాటం చేస్తున్నది సీపీఎం అని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, నాగేశ్వరరావు, బాలాజీ, రాములు, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.