విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా గురువారం సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పర్సన్ ఎన్. వీ. వేణుగోపాలచారి తెలిపారు. ఏన్కూరులోని సబ్ స్టేషన్ వద్ద ఉదయం 10-30నుండి మధ్యాహ్నం 1గంట వరకు జరిగే సదస్సులో ట్రాన్స్ ఫార్లలో లోపాలు, లో ఓల్టేజీ, నూతన సర్వీసుల మంజూరు, బిల్లుల్లో హెచ్చుతగ్గులు తదితర సమస్యలపై పిర్యాదు చేయొచ్చని తెలిపారు.