ఏన్కూరు మండలం ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే భానోత్ మదన్ లాల్ ఆదివారం బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 27వ తారీఖున హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.