రైతులకు పంట సాగుకు కొత్త రుణాలు ఇవ్వాలి: బీజేపీ

77చూసినవారు
రైతులకు పంట సాగుకు కొత్త రుణాలు ఇవ్వాలి: బీజేపీ
నిబంధనలు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు 2 లక్షల రైతు రుణమాఫీ చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ డిమాండ్ చేశారు. జూలూరుపాడు లో శనివారం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ. 15 వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని సూచించారు. అటు జిల్లాలో సాగు ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్