సింగరేణి మండలం కారేపల్లి గ్రామానికి చెందిన వేమూరి కీర్తి ట్రాన్స్ జెండర్ గా మొదటిసారి తన ఓటు హక్కును గురువారం వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వేమూరి కీర్తి మీడియాతో మాట్లాడుతూ సింగరేణి మండల పరిధిలో ట్రాన్స్ జెండర్ గా మొదటి ఓటును వేసినందుకు తను ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు.