పేరుపల్లి డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వరద

58చూసినవారు
కారేపల్లి మండలంలోని పేరుపల్లి వద్ద బుగ్గవాగు పొంగిపోర్లింది. ఇల్లెందు అటవీప్రాంతంలో భారీ వర్షం పడటంతో ఒక్కసారిగా బుగ్గవాగు ఉగ్రరూపం చాల్చింది. ఉదృతి క్షణక్షణానికి పెరుగుతూ పేరుపల్లిలోని డబుల్ బెడ్రూం కాలనీని ముంచెత్తింది. దీంతో స్థానికులు మోకాళ్ల లోతు నీళ్లల్లో గగ్గోలు పెట్టారు. ఈ విషయమై అప్రమత్తమైన ఆధికారులు, స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. పేరుపల్లి-మాధారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్